T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇవాళ (మార్చ్ 4న) దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ కి అర్హత సాధించడమే లక్ష్యంగా రెండు టీమ్స్ ఎంతో కసితో బరిలోకి దిగబోతున్నాయి. సెమీస్‌లో ప్రోటీస్ జట్టునే హాట్ ఫేవరెట్‌గా మైదానంలోకి దిగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆ జట్టు టోర్నీలో అద్భుతమైన ఫామ్‌ని ప్రదర్శించింది. అప్రతిహత విజయాలతో ముందుకు కొనసాగుతుంది. గ్రూపు స్టేజీలోనూ, సూపర్-–8లోనూ సౌతాఫ్రికా జట్టు ఇప్పటి వరకు ఓడిపోలేదు. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమీస్ కి చేరుకుంది. సఫరీల ఆత్మవిశ్వాసంతో ఈ సెమీఫైనల్ పోటీకి రెడీ అయింది. గ్రూప్ దశలో కివీస్ పై గెలవడం సౌతాఫ్రికాదే పైచేయిగా కనిపిస్తుంది.
ఇక న్యూజిలాండ్ టీమ్ విషయానికి వస్తే.. సఫారీ జట్టును నిలువరించాలంటే కివీస్ తప్పకుండా పుంజుకోవాల్సింది. దక్షిణాఫ్రికా అంత భీకరంగా కనిపించకపోయినా వారికి కూడా మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉంది. ఓపెనర్లు శుభారంభాన్నివ్వాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న ఈ పిచ్‌పై గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, రచిన్ రవీంద్ర కూడా బ్యాట్ ఝళిపిస్తే న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు వెళ్లడం ఈజీ అవుతుంది. మొదట బ్యాటింగ్ చేస్తే.. 200+ పరుగులు సాధిస్తేనే కివీస్ పోటీలో ఉంటుంది.
పిచ్ రిపోర్ట్
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అయ్యే ఛాన్స్ ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరించక పోవచ్చు.. కానీ పేసర్లకు మాత్రం పిచ్ నుంచి కొంత హెల్ప్ లభిస్తుంది. ఇక వాతావరణం విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని ఐఎండీ తెలిపింది. ఒకవేళ అనుకోకుండా వాన కురిస్తే సెమీఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. ఆ రోజు ఆట కూడా రద్దు అయితే సూపర్–-8 స్టేజీలో మెరుగ్గా ముగించిన టీమ్ ఫైనల్ కి వెళ్తుంది.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రియాన్ రికెల్టన్, ఏడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్ , కోర్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడి,
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి
